ఎంవీఎస్‌ ప్రసాద్‌ మృతి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమాచార శాఖ మాజీ కమిషనర్‌ ఎంవీఎస్‌ ప్రసాద్‌ గురువారం ఉదయం మరణించారు. ఆ శాఖకు ఆయన ప్రశంసనీయ, చిరస్థాయిలో నిలిచిపోయే సేవలందించారు. వివిధ హౌదాల్లో సేవలందించిన ఆయన కమిషనర్‌గా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆయన మరణం పట్ల సమాచార, పౌర సంబంధాలశాఖ ప్రత్యేక కమిషనర్‌ కె.అశోక్‌ రెడ్డి, సమాచార శాఖ సంచాలకులు బి.రాజమౌళి సంతాపం తెలిపారు.