గ్రామాభివృద్దే నా లక్ష్యం..

– ఊరుకోండపేట సర్పంచ్  అనితనాగోజీ.
నవతెలంగాణ – ఊరుకొండ 
ఊరుకొండ మండలంలోని ఊరుకొండపేట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానని సర్పంచ్ ఊరుకోండపేట సర్పంచ్ అనితనాగోజీ అన్నారు. బుధవారం మండలంలోని ఉరుకొండ పేట గ్రామపంచాయతీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా  బస్టాండ్ ఆవరణము నుండి  ఊరగుంట వరకు  రహదారి వెంబడి ఉన్న పెద్ద మురుగు కాలువ వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతూ  గ్రామ ప్రజలు  గ్రామ పంచాయితీకీ పిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో  పాలకమండలి సభ్యులు అందరు సమావేశం ఏర్పాటు చేసి అందరు కలిసి. మురుగు కాల్వల మరమ్మత్తులకు  తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. అదేవిదంగా ఒకటో వార్డు నుండి కీర్తిశేషులు మరుపాకుల నారాయణ  ఇంటినుండి  వయా  ప్రభుత్వ పాల కేంద్రము పక్కనుండి  బిటిరోడ్డు  వెంబడి  కాటమోని  జంగయ్య ఇంటివరకు  అండర్  డ్రైనేజీ పనులను కూడా కొద్దిరోజుల్లోనే ప్రారంభిస్తామని, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి సహకారంతో పల్లె దావఖాన, మన ఊరు- మనబడి   ప్రారంభమైన పనులను కూడా త్వరగా  పూర్తి చేసి రానున్న  కొద్దీ రోజుల్లో  గ్రామ ప్రజలకు,  విద్యార్థులకు  ప్రారంభించి అందుబాటులోకీ తెచ్చేవిధంగా కృషి  చేస్తానని అందుకు గ్రామ ప్రజల సహకారం అవసరం అని తెలిపారు.  కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శి ఇబ్రహీం, గ్రామ  ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.