
ఇందల్ వాయి మండలంలోని మల్లాపూర్ లో పారిశుద్ధ్య వారోత్సవాల నిర్వహణలో బాగంగా గురువారం పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్ వేస్లి, జిల్లా పంచాయతీ అధికారిని జయసుధ, నిజామాబాద్ డివిజన్ పంచాయతీ అదికారి నాగరాజు లు ఆకస్మికంగా సందర్శించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.ఈ నేలా17 నుండి 23 వరకు జరుగు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహణకు చేపడుతున్న, చేసిన వివరాలను సర్పంచ్ లోలం సత్యనారాయణ, ఎంపిఓ రాజ్ కాంత్ రావు, పంచాయతీ కార్యదర్శి అనుష లను అడిగి తెలుసుకుని పలు సూచనలు సలహాలు అందజేశారు.గ్రామంలో నిర్మించిన పల్లే పకృతి వనం, డంపింగ్ యార్డ్, వైకుంఠ దామం ను తనీఖి చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామలలో చేత్త లేకుండా, పరిశుభ్రత పాటించే విధంగా ప్రత్యేక అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని సూచించారు.