
– నిజామాబాద్ మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా
నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ నగర ప్రజలకు నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే విగల గణేష్ గుప్తా నమస్కారం తెలుపుతూ తనకు రెండుసార్లు అవకాశం ఇచ్చినందుకు నగర అభివృద్ధిని తన వంతుగా చేయడం జరిగిందని అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా సోమవారం తెలియజేశారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి పనులు మీ సహకారం తో చేయగలిగాను.ప్రజా స్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలు, మీ యొక్క తీర్పు ని ఏకీభవిస్తూ నిజామాబాద్ నగర ప్రజల కోసమే నా జీవితం అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు.