నా చివరి మాటలు

Shiva నా చివరి మాటలు.!
నల్ల కనుమల్లో
ఐదు అడుగుల గదుల్లో
ఆరడుగుల మనిషిలా
చీకటి నిండిన సౌత్ ఆఫ్రికాలో
ఎర్రటి భగభగ మండే సూర్యుడిలా
స్వతంత్రనాథమైన నెల్సన్ మండేలాల
నా ప్రపంచానికి నేను కాంతినే ఇస్తాను కానీ
కనుమూయను.!
ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు
కాదు
కాటికి చేరేవరకు
కాషాయాన్ని ఎదిరిస్తూ
కసాయికి బలైపోయినా కానీ
నా నెత్తురుతో విప్లవ వృక్షానికి
ప్రాణం పోస్తా
ఆవృక్షమే
అన్యాయాన్ని ఎదిరించే వాళ్లకి
విల్లంబులను అందిస్తుంది
తుపాకులను చేతికిస్తుంది
తూర్పుకు దారి చూపిస్తుంది
పడమరను చూసి
పడుకోవద్దని తెలియజేస్తుంది
చివరికి అన్యాయంపై విజయం సాధిస్తుంది
తారతమ్యాలు లేని సమాజం వస్తుంది
నూతన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది

 

ఇవే నా చివరి మాటలు…

కామ్రేడ్ శివ
9390362270
హనుమకొండ,కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్