– ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి
– నిజామాబాద్ అర్భన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గా షబ్బీర్ అలీ నామినేషన్ దాఖలు.
నవతెలంగాణ- కంఠేశ్వర్: నా జీవితం ప్రజా సేవకు కాంగ్రెస్ పార్టీకే అంకితం అని మాజీ మంత్రి నిజామాబాద్ అర్భన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షబ్బీర్ అలీ అన్నారు. నా జీవితం అంతా ప్రజాసే వకేనని, బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకుల వలే నాకు ఎలాంటి వ్యాపారాలు లేవని, ఫుల్ ప్లేజ్ గా రాజకీయ నాయకుడినని పేర్కోన్నారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్య ర్థిగా మొహమ్మద్ అలీ షబ్బీర్ నామినేషన్ దాఖలు చేశారు. నామి నేషన్ దాఖలు చేసిన అనంత రం మీడియాతో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యే లు, నాయకులు ప్రజాధనాన్ని దోచుకున్న దొంగలని విమర్శించారు. కాంగ్రె స్ హయాంలో చేసిన అభివృద్దే తప్ప అధికార పార్టీ నాయ కులు చేసిందేమీ లేదని మండి పడ్డారు. నిజామాబాద్ అర్బన్ నుంచి దరఖాస్తు చేసుకున్న 13 మంది అభ్య ర్థులు స్వచ్చం దంగా తనను పోటీ చేసేందుకు ఆహ్వా నించి మద్దతు తెలిపారని షబ్బీర్ ఆలీ అన్నారు.తాను మంత్రిగా ఉన్నప్పుడే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో అనుబంధం ఉందన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గా డిచ్ పల్లిలో 400 కె.వి. సబ్ స్టేషన్ తో పాటు ఎన్నో సంక్షేమ కార్య క్రమాలు చేశానన్నారు. తాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా, రాష్ట్ర మంత్రిగా ఉమ్మడి జిల్లాలో సహచరులతో తనకు మంచి సంబంధాలు ఉన్నా యన్నారు. గత కాంగ్రెస్ పార్టీ డి.శ్రీనివాస్ ప్రభుత్వ హాయాం లో ప్రజలకు 20వేల ప్లాట్లను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరు ద్యోగులకు ఆశ చూపించి మోసం చేయడంతో ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు సేవ చేసే పార్టీ అని 34 ఏళ్ల నా రాజకీయ అనుభవంలో ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం గా ముందుకెళ్తున్నానని అన్నా రు. ప్రజా సంక్షేమమే ధ్యేయం గా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. నిజామాబాద్ నగర డెవలప్ మెంట్ అనేది ఆగిపోయిందని తాను గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు డిక్లరేషన్ లను కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు నుంచే అమలు చేస్తామన్నారు. నిజా మాబాద్ అర్బన్ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి అని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, మాజీ ఎమ్మెల్సీఆకుల లలిత, కాంగ్రెస్ నగర అధ్యక్షులు కేశవేణు, టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హాందాన్, కాంగ్రెస్ నాయకులు రత్నా కర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.