కాంగ్రెస్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపిన: నా రెడ్డి మోహన్ రెడ్డి

నవతెలంగాణ- రామారెడ్డి
కాంగ్రెస్ సి డబ్ల్యూ సి నెంబర్ గా దామోదర్ రాజనర్సింహ నియమించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ నా యప్పన్ లను జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి కలిసి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రజలతో కలిసి, కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధిని, అధికార పార్టీ మోసాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేసి, కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలో తీసుకురావాలని సూచించినట్లు ఆయన తెలిపారు.