మయన్మార్‌ అక్రమ వలసదారుల

– బయోమెట్రిక్‌ డేటా సేకరణ షురూ
–  ప్రారంభించిన మణిపూర్‌ ప్రభుత్వం
ఇంఫాల్‌ : జాతి హింసతో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అక్రమ వలసదారుల బయోమెట్రిక్‌ సమాచారణ సేకరణ శనివారం ప్రారంభమైంది. మయన్మార్‌ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల బయోమెట్రిక్‌ సమాచారాన్ని సేకరించాలని కేంద్ర హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మళ్లీ కొనసాగించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి దీనిని పూర్తి చేయాలన్న కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో వివరించింది. ఇంఫాల్‌ ఈస్ట్‌ జిల్లాలో అక్రమ వలసదారులు బయోమెట్రిక్‌ డేటా సేకరణలో నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో అధికారుల బృందం.. రాష్ట్ర ప్రభుత్వాధికారులకు సహకరించిందని పేర్కొన్నది. ఈ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనసాగుతుందనీ, దీనిని ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేయాలన్న టార్గెట్‌ ఉన్నదని ప్రకటన వివరించింది.