
గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని శుక్రవారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని ఉప్పల్ వాయి షెడ్యూల్ కులాల వసతి గృహం, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకులాలకు అందజేసే, ప్రభుత్వం చెప్పుకునే సన్నబియ్యం అనేది, రీసైక్లింగ్ బియ్యాన్ని అందజేస్తున్నారని, అన్నం సరిగా కావటం లేదని, దానితో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం గతంలో అమలు చేసిన మెనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గుడ్లను, అల్పాహారాన్ని, పండ్లతోపాటు పలు ఆహార పదార్థాలను తగ్గించి విద్యార్థులకు ప్రభుత్వం అందించడం, విద్యార్థులకు అందిస్తున్న మెరుగైన భోజనానికి నిదర్శనమని ఎద్దేవ చేశారు. ఉప్పల్వాయికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు నారాయణ తప్పిపోయి, ఇంటికి చేరుకున్న సందర్భంగా ఆయనను పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు కాంగ్రెస్ గిరెడ్డి మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.