
మండలంలోని శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో సోమవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ప్రచార రథమును ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ…. ఎల్లారెడ్డి గడ్డపై కాంగ్రెస్ జెండాతో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలుపొందుతుతుండని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు నుండే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పని చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నా రెడ్డి శ్రీనివాసరెడ్డి, నాయకులు బండి పోచయ్య, నామాల రవి, బి పేట నర్సింలు, శివరాం, గంగారెడ్డి., తదితరులు పాల్గొన్నారు.