బీఆర్ఎస్ పార్టీలో చేరిన నడిపల్లి తండా యువకులు

నవతెలంగాణ- మోపాల్: నిజామాబాదు రూరల్ నియోజకవర్గం డిచిపల్లి మండలం నడిపల్లి తాండకు చేందిన 30 యువకులు నూడా చైర్మన్ ఈగ సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో అయన స్వగృహములో యువకులకు కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా నూడా, ఒలింపిక్ చైర్మన్ ఈగ సంజీవ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ యొక్క పథకాలకు ఆకార్షితులై పార్టీ లో చేరడం శుభ పరిణామమని అలాగే బాజిరెడ్డి గోవర్ధన్ ను బారి మెజార్టీ తో గెలిపించుకోవలని యువకులకు సూచించారు. తాండ కు చేందిన జె. గణేష్, అశోక్, వంశీ, ప్రవీణ్, కృష్ణ కళ్యాణ్, క్రాంతి, మహేష్, సతీష్, కిట్టు, వినోద్, బాబు, రాజు, దీపక్, రాకేష్, అనిల్, గజేందర్, రాంచరణ్, మోతి రామ్ తదితరులు వున్నారు.