1. దశవిధ రూపకములను గూర్చి చెప్పిన గ్రంథం?
ఎ. భరతుని-నాట్యశాస్త్రం బి.దండి-కావ్యాదర్శము
సి. ధనుంజయుడి-దశరూపకం డి.భోజుడి-సరస్వతీ కంఠాభరణము.
2. ప్రాచీనాలంకారికుల దృష్ట్యా నాటకంలో ఎన్ని అంకాలుండాలి? మరియు నాయకుడు ఎలా ఉండాలి?
ఎ. 2-5 అంకములు-ధీర శాంతుడైన నాయకుడు
బి. 5-10 అంకములు-ధీరోదాత్తుడైన నాయకుడు
సి. 10-15 అంకమకులు – ధీర శాంతడైన నాయకుడు
డి. 1-4 అంకములు-ధీరోద్దతుడైన నాయకుడు
3. ‘కావ్వేషు నాటకం రమ్యం’ (కావ్యాలలో ‘నాటకం’ రమ్యమైంది) అన్న ఆలంకారికుడు.
ఎ. భరతుడు బి. దండి సి. ధనుంజయుడు డి. కాళిదాసు
4. కావ్యం శ్రవ్యకావ్యం, దృశ్యకావ్యం అని రెండు విధాలు. అయితే దృశ్యకావ్యాలంటే?
ఎ. నాటకాది దశరూపకములు బి. భారత, రామాయణాలు
సి. శ్రవణేంద్రియాలతో పాటు నేత్రేంద్రియాలకు ప్రీతి కల్గించేవి
డి. ఎ మరియు సి
5. ‘దశ రూపకములు’ ఏవి?
ఎ. నాటకం, ప్రకరణం, బాణం బి. వ్యామోగం, సమవాకారం, డిమం
సి. అంకం, వీధి, ప్రహాసనం, ఈహమృగం
డి. ఎ,బి మరియు సి
6. ప్రాచీన అలంకారికులు చెప్పిన నాటక లక్షణాలు?
ఎ. నాంది-ప్రస్తావన-విష్కంభం-పంచసంధులు-భరతవాక్యం
మున్నగునవి నాటక ప్రధానాంగాలు.
బి. వీర, శృంగార రసములలో ఏదో ఒకటి ప్రధాన రసం కావాలి.
సి. నాయిక వధ ఉండరాదు. నాయకుడు ఒకవేళ మరణించినా
పునరుజ్జీవితున్ని చేయాలి.
డి. పైవన్నీ
7. ”పంచ సంధులు (ముఖ, ప్రతిముఖ, గర్భ, అవమర్శ, నిర్వహణ సంధులు) చెడిన నాటకము కీళ్లు సడలిన బొమ్మ” – అన్నవారు?
ఎ. శ్రీపింగళి లక్ష్మీకాంతం
బి. డా|| పోణంగి శ్రీరామ అప్పారావు
సి. డా|| దివాకర్ల వేంకటావధాని
డి. విశ్వనాథ సత్యనారాయణ
8. సంస్కృత లక్షణాల ప్రకారం తెలుగులో ‘వీధి’ లక్షణాలతో రాయబడి, ‘వినుకొండ వల్లభరాయుడి’ పేరు కనిపిస్తున్న క్రీడాభిరామం’ అనే రూపక కర్త ఎవరు? ఎ. నన్నయ బి. పాల్కురికి సోమన
సి. శ్రీనాథుడు డి. పోతన
9. నాడు తెలుగు ప్రాంతాల్లో ఆధునిక నాటక ప్రదర్శనకు ప్రేరణ ఇచ్చిన నాటక సమాజం?
ఎ. జగన్నాథ విలాసినీ నాటక సమాజం బి. ధార్వాడ నాటక సమాజం
సి. విద్యార్థి నాటక సమాజం
డి. ఆంధ్ర భాషాభిమాన సమాజం
10. తెలుగులో సంస్కృత నాటకాల అనువాదాలు/స్వతంత్ర తెలుగు నాటకాలు ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి? ఎ. 1893 తర్వాత బి. 1885 తర్వాత
సి. 1860 తర్వాత
డి. పూర్వకాలం నుండి
11. తొలి తెలుగు స్వతంత్ర నాటకం ఏది? ఎ. శ్రీకోరాడ రామచంద్ర శాస్త్రి-మంజరీ మధుకరీయం
బి. కొక్కొండ వేకంటరత్నం-నరకాసుర విజయవ్యామోహం
సి. వాలిలాల వాసుదేవ శాస్త్రి-నందక రాజ్యం
డి. కందుకూరి వీరేశలింగం పంతులు-రాజశేఖర చరిత్ర
12. ‘ప్రతాపరుద్రీయం’ నాటకం రాసినవారు? ఎ. కొక్కొండ వేంకటరత్నం బి. విద్యానాథుడు
సి. కందుకూరి వీరేశలింగం
డి. వేదం వెంకటరాయశాస్త్రి
13. ధర్మవరం రామ కృష్ణమాచార్యుల నాటకాలు గుర్తించుము? ఎ. చిత్రనళీయం, విషాద సారంగధర, పాదుకా పట్టాభిషేకం
బి. ప్రమీలార్జునీయం, ప్రహ్లాదనాటకం, అజామీళ, చంద్రహాస
సి. ఎ మరియు బి
డి. గమోపాఖ్యానం, ప్రసన్నయాదవం, సీతాకళ్యాణం
14. క్రింది వానిలో సరికానిది? ఎ. సరసవినోదినీ సభ-ధర్మవరము రామకృష్ణమాచార్యులు
బి. ధార్వాడ నాటక సమాజం-కందుకూరి విరేశలింగం
సి. సుమనోరమా సభ-కోలాచలం శ్రీనివాసరావు
డి. హిందూ సమాజం-శ్రీ ఇమ్మనేని హనుమంతరావు
15. ‘బొబ్బిలి యుద్ధం’ విషాదాంత చారిత్రక నాటకరక్త? ఎ. శ్రీపాదకృష్ణమూర్తి బి. పానుగంటి లక్ష్మీనరసింహారావు
సి. చిలకమర్తి లక్ష్మీనరసింహం డి. బలిజేపల్లి లక్ష్మీకాంతం
16. తెలుగులో వెలువడిన తొలి స్వతంత్ర సాంఘిక నాటకం? ఎ. హరిశ్చంద్ర బి.చింతామణి
సి. ప్రతాపరుద్రీయం
డి. కన్యాశుల్కం
17. సురవరం ప్రతాపరెడ్డి గారు రాసిన నాటకాలు? ఎ. తప్పెవరిది, గాలివాన
బి. చలిచీమలు, వెంటాడే నీడలు
సి. ఉచ్చల విషాదం, భక్తతుకారం
డి. చింతామణి, రోషనార
18. ‘ఆంధ్రనాటక పితామహుడు’గా ప్రసిద్దిగాంచిన వారు? ఎ. గురజాడ అప్పారావు బి. ధర్మవరం కృష్ణమాచార్యులు
సి. వేదం వేంకటరామశాస్త్రి
డి. చిలకవర్తి లక్ష్మీనరసింహా
19. ‘నాటక శిల్పం’ అనే విమర్శనాత్మక గ్రంథం ఎవరిది? ఎ. మొదలి నాగభూషణ శర్మ బి. పి.ఎస్.ఆర్.అప్పారావు
సి. సర్దేశాయి తిరుమలరావు
డి. పింగళి లక్ష్మీకాంతం
20. ‘తెలుగు నాటక వికాసకం’ అనే గ్రంథం రాసి, నాటక ప్రక్రియపై పరిశోధన చేసిన వారు? ఎ. డా|| పోణంగి శ్రీరామ అప్పారావు
బి. మొదలి నాగభూష శర్మ
సి. బలిజేపల్లి లక్ష్మీకాంతం
డి. వాలిలాల వాసుదేవ శాస్త్రి
21. ‘ప్రోలోగు, ఎపిలోగు’-లాంటి ప్రాశ్చత్య సంప్రదాయాలు తెలుగు ఏ ప్రక్రియలో కనిపిస్తాయి?
ఎ. నవల
బి. నాటకం
సి. కథ
డి. నాటిక
22. ‘దురాశాభంగము’ అనే నామాంతరం గల ‘సునందినీ పరిణయము’ అనే నాటకం రాసినవారు?
ఎ. శ్రీ కందుకూరి వీరేశలింగం
బి. కాళ్లకూరి నారాయణరావు
సి. శ్రీకోలాచలం శ్రీనివాసరావు
డి. బళ్ళారి రాఘవా
23. సుల్తానా చాందు బీబీ, చంద్రగిర్యభ్యుదయం, ప్రతాపాక్బరీయం, మైసూరు రాజ్యం-లాంటి చారిత్రక నాటకాలు రాసి, ‘ఆంధ్ర చారిత్రనాటక పితామహులని’ ప్రసిద్ధిగాంచిన వారు? ఎ. కాళ్లకూరి నారాయణరావు
బి. ధర్మవరం కృష్ణమాచార్యులు
సి. బలిజేపల్లి లక్ష్మీకాంతం
డి. కోలాచలం శ్రీనివాసరావు
24. ‘ప్రతాపరుద్రీయము’ అనే ప్రసిద్ధ నాటకం రాసినవారు?
ఎ. వేదం వేంకటరామ శాస్త్రి
బి. కోలాచలం శ్రీనివాసరావు
సి. కందుకూరి వీరేశలింగం
డి. వావిలాల వాసుదేవ శాస్త్రి
25. ఆంధ్ర షేక్సి ్పయర్ శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహం గారు రాసిన నాటకాలు/నాటకం
ఎ. పాదుకాపట్టాభిషేకం
బి. రాధాకృష్ణ, విప్రనారాయణ
సి. కంఠాభరణం
డి. పైవన్నీ
సమాధానాలు
1.సి 2.బి 3.ఎ 4.డి 5.డి
6.డి 7.ఎ 8.సి 9.బి 10.సి
11.ఎ 12.డి 13.సి 14.బి 15.ఎ
16.డి 17.సి 18.బి 19.ఎ 20.ఎ
21.బి 22.సి 23.డి 24.ఎ 25.డి
నానాపురం నర్సింహులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల,మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా.
9030057994