– కామారెడ్డి జిల్లా బాన్సువాడ మహిళా హోం గార్డ్ నాగమణి సంచలన విడియో విడుదల
– నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన హోం గార్డ్ నాగమణి
– సీఎం కేసీఆర్ అందరు హోం గార్డులను పర్మినెంట్ చేసి ఆదుకోవాలి
నవతెలంగాణ -కంటేశ్వర్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళా హోంగార్డులు, అసలు మహిళా ఓంకార్లు అంటే జంగల్ హోంగార్డుల పరిస్థితి అధ్వానంగా ఉందని నిజామాబాద్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్నటు వంటి హోంగార్డులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మహిళా హోంగార్డు నాగమణి సంచలన వీడియో విడుదల చేసింది. నిజాంబాద్ జిల్లా కేంద్రానికి చెందిన హోంగార్డు నాగమణి సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతూ నాగం మని వీడియో పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి సార్ అందరూ హోంగార్డులను పర్మినెంట్ చేసి ఆదుకోవాలని కోరుతున్నాము. అసలు విషయంలోకి వెళ్తే.. నా భర్త సాయి కుమార్ లాస్ట్ స్టేజిలో ఉన్నాడు, పట్టించుకోండి, పిల్లలను హాస్టల్ లో ఉంచి చదివిస్తున్నను. హైదరాబాద్ హోం గార్డ్ రవీందర్ భార్య అనుభవిస్తున్న బాధను తాను అనుభవిస్తున్నను అని వీడియోలో తెలుపుతుంది. చాలి చాలని జీతాలతో బాతక లేకపోతున్నాం, వ్యక్తిగత బాధలు చెప్పుకోలేక పోతున్నాం.హాస్టల్ ఖర్చులు, స్కూల్ ఫీజులు చెల్లించక ఇబ్బందులు పడుతున్నాము, అందరిలాగే తమ పిల్లల్ని కూడా మంచిగా చదివించుకోవాలని అనుకుంటాం కానీ ఇప్పుడున్న పరిస్థితులలో చదివించాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మావి విలువలు లేని బతుకులు గా మారాయని ఆవేదన వ్యక్తం చేసింది. హోం గార్డ్ నేతలు సిఎం కెసిఆర్ దృష్టి కి తీసుకెళ్లండి అనే సంబంధిత హోంగార్డ్ సిబ్బందిని సైతం ఉన్న అధికారులను సైతం కోరుతుంది. తాము తెలంగాణ బిడ్డలమే హోం గార్డులను న్యాయం చేస్తే సీఎం కేసీఆర్ ఫొటో పెట్టుకుని బతుకుతాం అని కోరుతుంది.హోం గార్డులు ఆత్మహత్యలు చేసుకోవద్దు వేసుకున్న మహిళ హోం గార్డ్ నాగమణి అంటు సంచలన విడియో ఇప్పటికైనా హోంగార్డులలో చైతన్యం రావాలని కోరుతుంది. లేదు అంటే మన బతుకులు మారవు. మన బతుకులు మారాలంటే పోలీస్ శాఖలు పనిచేస్తూ ట్రైనింగ్ తీసుకున్నా మనము అన్నిటికీ తెగించి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలని వేడుకుంటుంది. హోంగార్డులను ఎప్పుడో జీతాలు పెంచి మరి కానిస్టేబుల్ పోదాము ఇస్తామని ఒకప్పుడు ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు జరుగుతుంది..? అసలు హోంగార్డు జీవితాలు మారుతాయా అని సంబంధిత అధికారులను, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను అడిగి వేడుకుంటున్నారు. ఇందులో ఆ మహిళ ఒకటే కాదు ఎంతోమంది నరకం అనుభవిస్తున్నారు కానీ బయటకు మాత్రం చెప్పుకోవడం లేదు. కేవలం నామ్ కి వస్తే హోంగార్డులం అంతే. దీనిపై పున్నారా ఆలోచన చేసి తమ బతుకులను మార్చాలని హోంగార్డులందరూ నిజామాబాద్ కామారెడ్డి లో పనిచేస్తున్న వారందరూ కోరుకుంటున్నారు.