– నేనేంటో చూపిస్తా : మాజీ మంత్రి నాగం
– ప్రతి మండలంలో ఆత్మీయ సమావేశాలు
– కాంగ్రెస్ కార్యకర్తలను ఐక్యం చేస్తా
నవ తెలంగాణ – మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధి
నాగర్ కర్నూల్‌లో ఇక నుంచి చక్రం తిప్పుతానని మాజీ మంత్రి డా. నాగం జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా నాగం జనార్ధన్ రెడ్డి పా ల్గొని ప్రసంగించారు. నాగర్‌కర్నూల్‌లో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి వ్యవహార శైలీపై నాగం విమర్శలు గుప్పించారు. తన కుమారుడిని కాంగ్రెస్ లోకి పంపించి తను మాత్రం బీఆర్‌ఎస్ లో కొనసాగడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోకి వచ్చాక ఓడిపోతే ఉన్న పదవిని కోల్పోతానన్న భయంతోనే దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయట్లేదని ఎద్దేవా చేశారు. ధైర్యం ఉంటే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాకే కాంగ్రెస్‌లోకి రావాలన్నారు. తను మాత్రం పదవులకు ఏనాడూ లొంగిపోలేదని.. ఎల్లప్పు డూ ప్రజల పక్షాన నిలబడ్డానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తొలి నాటి నుంచి అవినీతి, అక్రమాలపై పోరాడుతున్నానని.. అలా నిజాయితీగా ఉంటూ పోరాడటమే తన తప్పా అని ప్రశ్నించారు. ఇక ప్రతి మండలంలో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తానని వెల్లడించారు. తనకు రాజ్యసభ పదవిని ఆఫర్ చేశారన్న వార్తలను నమ్మొద్దని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, టీపీసీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, మహిళా నేతలు,యూత్ కాంగ్రెస్ నేతలు, ముఖ్య కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై
మిడ్జిల్ : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లు చేసి బ్యాంకు అకౌంట్ నెంబర్లు ఏటీఎం కార్డు పిన్ నెంబర్లు అడిగితే సమాచారము ఇవ్వవద్దని ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని వాడియాల గ్రా మంలో సురక్ష పోలీసు కళా బందం మహబూబ్ నగర్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు, బాల్య వివాహాలు, హత్యలు, ఆత్మ హత్యలు, అత్యా చారాలు, మూఢ నమ్మకాలు, లైంగిక వేదింపులు, ప్రేమ పేరుతో వంచనలు, ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు కుల వివక్ష తదిత వివిధ సామాజిక రుగ్మతలు, సాంఘీక దురాచారాలపై సామాజిక అవగాహనా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.గ్రామాలలో చిన్నచిన్న గొడవ లకు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని కోట్ల చుట్టూ తిరగ వద్దని సూచి ంచారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంగమ్మ శ్రీనివాసులు, గ్రామస్తులు యాదయ్య, గడ్డల మధ్ను, వెంకటయ్య, శంకర్, సుకుమార్, బొర్రా రాఘవేందర్, అంగన్వాడి టీచర్ మహిమల ఆశా కార్యకర్త నర్మద మహిళా సంఘ సభ్యులు , పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.