పట్టణంలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు

నవతెలంగాణ- ఆర్మూర్  

పట్టణంతో పాటు పెర్కిట్ ,మామిడిపల్లి తదితర ఆలయాల్లో సోమవారం ఘనంగా నాగుల పంచమి వేడుకలు జరుపుకున్నారు. పలు ఆలయాలు మహిళలు యువతులు, పిల్లలతో కిటకిటలాడాయి. పుట్టలో పాలు పోసి నైవేద్యం సమర్పించి పూజలు చేసినారు. ఆడబిడ్డలు సోదరుల కండ్లను పాలతో కడిగి మిఠాయిలు తినిపించారు. ప్రముఖ న్యాయవాది కౌన్సిలర్ కాందేశ్ సంగీత తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించినారు.