నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నర్సింగ్ విద్యనభ్యసించేందుకు అబ్బాయిలకూ అవకాశం కల్పించాలని తెలంగాణ ఫ్లోరెన్స్ నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నక్క సూర్య కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏ కోర్సులో లేని వివక్షను నర్సింగ్ కోర్సుల్లో చూపిస్తున్నారని విమర్శించారు. హాస్టల్ లేదనే కారణంతో అడ్మిషన్లు నిరాకరిస్తే పేద అబ్బాయిలు ప్రయివేటులో చదవలేక నర్సింగ్ విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అబ్బాయిలకు ప్రవేశం కల్పించాలని 2005లోనే ఉత్తర్వులిచ్చినప్పటికీ ఇప్పటికీ అమలు చేయకపోవడం దారణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.