నవతెలంగాణ-హైదరాబాద్
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరిన నేపథ్యంలో నందమూరి, నారా కుటుంబాలు గురువారం సంఘీభావం చెప్పాయి. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సీతంపేట వద్ద పైలాన్‌ను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవిష్కరించారు. నందమూరి, నారా వారి కుటుంబాల నుంచి పలువురు పాదయాత్రలో పాల్గొన్నారు. కొద్దిసేపు లోకేష్‌తో కలిసి నడిచారు. లోకేష్ తల్లి నారా భువనేశ్వరి కుమారుడి పాదయాత్ర పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రెండు కుటుంబాలు కలిసిరావడం పట్ల లోకేష్ సైతం ఆనందం వ్యక్తం చేసినట్టు హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో గారపాటి లోకేశ్వరి, నందమూరి జయకృష్ణ, చైతన్యకృష్ణ, ఆయన భార్య రేఖ తదితరులు పాల్గొన్నారు.