సీపీఐ(ఎం) అభివృద్ధికి కృషి చేసిన నారాయణరావు

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- కూసుమంచి
జజ్జులరావు పేట గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సిపిఎం పార్టీ అభివృద్ధికి వెల్లంపల్లి నారాయణరావు ఎంతో గాను కృషి చేశారని ఆయన లేని నోటు పార్టీకి తీరనిలోటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం మండలంలోని జుజ్జుల్‌ రావు పేట గ్రామానికి చెందిన కల్లూరు గూడెం సొసైటీ మాజీ చైర్మన్‌ వెల్లంపల్లి అశోక్‌ తండ్రి వెల్లంపల్లి నారాయణరావు దశదినకర్మకు హాజరైన ఆయన నారాయణరావు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్‌, మండల కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల పార్టీ కార్యదర్శులు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.