అమెరికాలో జాతీయ రహదారికి

– భారత సంతతి పోలీస్‌ అధికారి పేరు
వాషింగ్టన్‌ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఒక జాతీయ రహదారికి భారత సంతతికి చెందిన పోలీసు అధికారి రోనిల్‌ సింగ్‌ పేరు పెట్టారు. న్యూమాన్‌లోని హైవే 33 యొక్క విస్తరణకు ‘కార్పోరల్‌ రోనిల్‌ సింగ్‌ మెమోరియల్‌ హైవే’ అని పేరు పెట్టి, దీనిని ప్రకటించే సూచికను స్టుర్‌ రోడ్‌ వద్ద ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సింగ్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రోనిల్‌ సింగ్‌ 2011 జులైలో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. 2018 డిసెంబర్‌ 26న విధుల్లో ఉన్న సింగ్‌ను ఒక అక్రమవలసదారుడు కాల్చి చంపాడు.