జాతీయ నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన ఉన్నతాధికారులు

నవతెలంగాణ-మట్టెవాడ
నేషనల్‌ క్వాలిటీ స్టాండర్డ్‌ గుర్తింపు సాధించుట కొరకు రాష్ట్రహెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ నోడల్‌ ఆఫీసర్‌, కమి షనర్‌ జేవి శ్రీనివాస రావు హైదరా బాద్‌ నుండి విచ్చేసి గత రెండు రోజు లుగా హనుమకొండ జిల్లాలోని 10 హె ల్త్‌అండ్‌వెల్నెస్‌ సెంటర్‌ లను సందర్శి స్తున్నారు. జాతీయ నాణ్యతా ప్రమాణా లకు అనుగుణంగా పల్లె దవఖానాలలో ముఖ్యమైన 7 సర్విస్‌ లలో గర్భిణీ స్త్రీల పరిరక్షణ, సుఖప్రసవం, పుట్టిన శిశువుల ఆరోగ్య పరిర క్షణ సేవలు, బాల్యంలో కౌమార దశలో అందించే ఆరో గ్య సేవలు, కుటుంబ నియంత్రణ, అంటువ్యాధులు ప్ర భలకుండా తీసుకునే చర్యలు, సాధారణ వ్యాధుల నిర్వ హణ అసంక్రమిత వ్యాధుల నిర్వహణ సేవలు పటిష్ఠ పరిచేందుకు తీసుకోవలసిన చర్యలు ప్రజలకు అం ది స్తున్న సేవలు, వసతులు, జాతీయ కార్యక్రమాల అమ లు, రికార్డుల నిర్వహణ, రోగులతో ఇంటర్వ్యూ చేసి వివి ధ అంశాలను, సేవలను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బంది కి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ యాకూబ్‌పాషా, జిల్లా మాస్‌ మీడి యా అధికారి అశోక్‌రెడ్డి, ఎల్కతుర్తి, ఉప్పల్‌, కమలా పూర్‌, ఆత్మకూర్‌, రాయపర్తి కొండపర్తి పీహెచ్‌ సీల వైద్య అధికారులు,పల్లె దవఖానా వైద్య అధికారు లు, సిహెచ్‌ఓ, డిపిఓ ఎన్‌హెచ్‌ఎం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.