ఈఎస్‌సీఐ ఆధ్వర్యంలో ‘సక్సెస్‌ స్టోరీస్‌ ఆఫ్‌ స్టార్టప్‌’లపై జాతీయ వెబ్‌నార్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఈఎస్‌సీఐ) హైదరాబాద్‌ నేతృత్వంలో ‘సక్సెస్‌ స్టోరీస్‌ ఆఫ్‌ స్టార్టప్‌’లపై జాతీయ వెబ్‌నార్‌ నిర్వహించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఈఎస్‌సీఐ)లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పీజీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులతోపాటు దేశవ్యాప్తంగా దాదాపు 150 మంది స్టార్టప్‌ల నిర్వాహకులు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. వారు తమ అనుభ వాలను, వ్యాపారం రంగంలో సాధించిన ఉత్తమ ఫలితాలను వివరించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, స్కూల్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జీ. రామేశ్వర్‌ రావు మాట్లాడారు. ఇలాంటి జాతీయ వెబ్‌నార్‌లు ఎంతో ఉపయోగపడతాయని, నూతనంగా వ్యాపార రంగంలోకి వచ్చేవారు, స్టార్టప్‌లు ప్రారంభించే వారు ఎంతో ప్రేరణ పొందుతారని అభిప్రాయపడ్డారు. ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాలో అందించే కోర్సులు జీవితంలో ఎంతో ఉపయోగపడతాయన్నారు. స్కూల్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌, జనరల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇండిస్టియల్‌ సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌లో రెండేం డ్లకుగాను ప్రత్యేక కోర్సులు అందిస్తామన్నారు. ఈఎస్‌సీఐలోలో అందించే కోర్సులు ఇంజినీరింగ్‌, సాంకేతికత రంగాల్లో రాణించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. అనంతరం హాజరైన ప్రముఖులు, ప్టార్టప్‌ల వ్యవస్థాపకులు, సీఈఓలు వారు స్థాపించిన స్టార్టప్‌ల వల్ల మొదట్లో ఎదుర్కొన్న సవాళ్లను, వాటి పరిష్కారాలను పంచుకున్నారు. విజయానికి కావాల్సిన వ్యూహాలను వివరించారు. పరిశ్రమలు స్థాపించడం, వాటివళ్ల నేర్చుకున్న పాఠాలు, అనుభవాలను పంచుకు న్నారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు పరిశ్రమకు తగినట్టుగా సిద్ధం కావచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. పాపజపాటా సీఈఓ, స్టార్టప్‌ లైఫ్‌స్టైల్‌ హబ్‌ వ్యవస్థాపకులు అర్జున్‌ పంచాల్‌, టారు ట్రంక్‌ ప్రయివేటు లిమిటెడ్‌ సీఈఓ అజరు వైద్య, స్పెక్ట్రాన్సిస్‌ సీఈఓ కోట్యా న్యాయక్‌, వేర్‌ యు ఎలివేట్‌ సహా వ్యవస్థాపకులు, సీఇఓ రిషబ్‌ ఇహ్వాడీ, ఇండియా స్టార్‌ అచీవర్‌, యంగెస్ట్‌ ఇన్నోవేటర్‌, వరంగల్‌ రూరల్‌ ‘ఐఎన్‌ఇఎక్స్‌’-2022 బంగారు పతకం విజేత యాకర గణేష్‌, డీవీ జూట్‌ బ్యాగ్స్‌ వ్యవస్థాపకులు దివ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.