నవతెలంగాణ వరంగల్‌ రీజనల్‌ మేనేజర్‌..

బోయినపల్లి దేవేందర్‌ రావుకు పితృవియోగం
నవతెలంగాణ-వరంగల్‌
నవతెలంగాణ వరంగల్‌ రీజనల్‌ మేనేజర్‌ బోయినపల్లి దేవేందర్‌ రావు తండ్రి బోయినపల్లి గోపాల్‌రావు (85) వరంగల్‌ జిల్లా నల్లబెల్లి గ్రామంలో అనారోగ్యంతో మంగళవారం మృతిచెందారు. ఆయన మృతదేహానికి పూలమాల వేసి పలువురు సంతాపం తెలిపారు. అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నారు. మృతునికి నలుగురు కుమారులు కాగా, పెద్ద కుమారుడు నవతెలంగాణ వరంగల్‌ రీజియన్‌ మేనేజర్‌ బోయినపల్లి దేవేందర్‌ రావు. కాగా, దేవేందర్‌, ఆయన కుటుంబానికి నవతెలంగాణ సీజీఎం ఎం.ప్రభాకర్‌, ఇన్‌చార్జి ఎడిటర్‌ రాంపల్లి రమేష్‌, మఫిషిల్‌ ఇన్‌చార్జి వేణు తమ సంతాపాన్ని తెలిపారు.