నవరాత్రి దుర్గామాత ఉత్సవాల ఊరేగింపు

– టీచర్స్ కాలనీ ప్రజలు ప్రత్యేక పూజలు
నవతెలంగాణ మద్నూర్: దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. మంగళవారం విజయదశమి నాడు ఉదయం దుర్గామాత విగ్రహ ఊరేగింపు కాలనీలో నిర్వహించారు.  ప్రజలు ఉత్సాహంగా ఆనంద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం టీచర్స్ కాలనీలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన జరిపి నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విజయదశమి రోజున ఊరేగింపు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహిస్తారు. దుర్గామాత విగ్రహ ఊరేగింపు కార్యక్రమంలో టీచర్స్ కాలనీ ప్రముఖులు, మహిళలు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.