నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌజ్‌ పుస్తక ప్రదర్శన

నవతెలంగాణ-జనగామ
బాలల దినోత్సవం సందర్భంగా ‘నవతెలంగాణ’ పబ్లిషింగ్‌ హౌజ్‌ అధ్వర్యంలో జన గామ నెహ్రూ సెంటర్‌లో పుస్తక ప్రదర్శనను సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఆది వారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో జ్ఞానానికి, విజ్ఞా నానికి సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, జనగాం జిల్లా ప్రజలు ఉపా ద్యాయులు, విద్యార్థులు, కవులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బుక్‌ హౌజ్‌ మేనే జర్‌ బండారి బాబు మాట్లాడుతూ సాహిత్యం, కథలు, నవలలు, గ్రామర్‌ బుక్స్‌ తెలుగు ఇంగ్లీష్‌తో పాటు అన్ని రకాల బుక్స్‌ అందుబాటులో ఉన్నాయని, అన్ని పుస్తకాలపై పది శాతం తగ్గింపు ఇవ్వడం జరుగుతుందని, ఈ పుస్తక ప్రదర్శన వారం రో జుల పాటు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అహల్య, ప్రకాష్‌, గోపి, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.