నీట్‌ కటాఫ్‌ స్కోర్‌ తగ్గించిన కేంద్రం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నీట్‌ పీజీ కటాఫ్‌ స్కోర్‌ను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తగ్గించింది. ఈ నేపథ్యంలో మెడికల్‌ సీట్లకు మరోమారు దరఖాస్తులు చేసుకునే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్యవిశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్‌ కళాశాలల్లో కన్వీనర్‌, యాజమాన్య కోటాలో మరోమారు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈనెల 24వ తేది సాయంత్రం 6 గంటల వరకు అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోవాలని వరంగల్‌లోని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ ఒక ప్రకటన జారీ చేసింది.