జిల్లా న్యాయమూర్తిని కలిసిన నూతన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్

నవ తెలంగాణ – ఆర్మూర్ : పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఖాందేష్ శ్రీనివాస్ ఇటీవల  అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులైన సందర్బములో  మంగళవారం  జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీమతి సునీత కుంచాల గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి బోకే అందచేశారు. ఈ కార్యక్రమములో నిజామాబాదు ఉమెన్స్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ , న్యాయవాది సంగీతా ఖాందేష్ పాల్గొన్నారు.