పార్లమెంట్‌ సిబ్బందికి కొత్త డ్రెస్‌ కోడ్‌

New dress code for Parliament staffన్యూఢిల్లీ : కొత్త పార్లమెంట్‌ భవనంలో తొలి సమావేశాలు వచ్చే వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ అమృతకాల్‌లో కొత్త అంశం చోటుచేసుకోనున్నది. సెప్టెంబర్‌ 18 నుంచి 22 వరకూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేస్తున్నట్టు పార్లమెంటరీ వ్యవహా రాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి గత ఆగస్టు 31న ప్రకటించారు. లోక్‌సభ, రాజ్యసభ సిబ్బందికి ఇంతవరకూ అమలు చేస్తున్న డ్రెస్‌కోడ్‌ స్థానే కొత్త డ్రెస్‌ కోడ్‌ను ఈ సమావేశాల్లో అమల్లోకి తెస్తున్నారు. ‘ఇండియన్‌ టచ్‌’తో ఈ డ్రస్‌ కోడ్‌ ఉండబోతున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఉద్యోగుల యూనిఫాంగా రౌండ్‌ నెక్‌ ఉన్న చొక్కాలు, ఖాకీ కలర్‌ ప్యాంటులు ఉండబోతున్నాయి. మణిపూర్‌ టోపీ, షర్ట్‌పై ధరించేందుకు స్లీవ్‌లెస్‌ జాకెట్లు ఉంటాయి. ఈ కాస్ట్యూమ్‌లను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ డిజైన్‌ చేసింది.
మార్షల్స్‌ కోసం సఫారీ సూట్‌లకు బదులుగా క్రీమ్‌ కలర్‌ కుర్తా, ఫైజమాలు రెడీ చేశారు. పార్లమెంటరీ డ్యూటీ గ్రూప్‌కు కూడా కొత్త డ్రెస్‌ కోడ్‌ తీసుకువచ్చే వీలుందని తెలుస్తోంది. మహిళా ఉద్యోగుల కోసం కొత్త డిజైన్‌ చీరలు సిద్ధం చేశారు.