ఒరైమా నుంచి కొత్త ఫ్రీపాడ్స్‌

New Freepods from Oraima– లైట్‌ ఇయర్‌బడ్స్‌ విడుదల
హైదరాబాద్‌ : ఆడియో ఇన్నోవేషన్‌ ఉత్పత్తుల కంపెనీ ఒరైమో కొత్తగా ‘ఫ్రీపోడ్స్‌ లైట్‌’ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 40 గంటల పాటు వీడిని వాడుకోవచ్చని ఆ సంస్థ పేర్కొంది. కేవలం 10 నిమిషాలు ఛార్జింగ్‌ చేస్తే 120 నిమిషాల వరకు వినియో గించవచ్చని తెలిపింది. దీని ధర రూ.1000 దిగువన ఉంటుందని పేర్కొంది. తమ ఉత్పత్తులకు బాలీవుట్‌ నటీ మృణాల్‌ ఠాకూర్‌తో క్యాంపెయిన్‌ చేస్తోన్నట్లు తెలిపింది. ఫ్రీపోడ్స్‌ క్రిస్టల్‌ క్లియర్‌ ధ్వనీతో సంగీత ప్రియులకు మంచి అనుభూతిని అందిస్తుందని వెల్లడించింది.