దావణగెరెకు కొత్త సూపర్‌ లగ్జరీ సర్వీస్‌

– ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రయాణికుల సౌకర్యార్థం కర్ణాటకలోని దావణగెరెకు కొత్త సూపర్‌ లగ్జరీ సర్వీస్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని మియాపూర్‌ నుంచి దావణగెరెకు ప్రతి రోజు సాయంత్రం 06.40 గంటలకు ఈ బస్సును నడుపుతోంది. ఈ కొత్త సర్వీస్‌ కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌ నగర్‌, అమీర్‌పేట్‌ , ఎంజీబీఎస్‌, మహబూబ్‌ నగర్‌, రాయచూరు, సిందనూరు, గంగావతి, హౌస్పేట్‌ మీదుగా వెళ్తుంది. దావణగెరె నుంచి ప్రతి రోజు సాయంత్రం 06.00 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతుంది.