నవతెలంగాణ:మహాముత్తారం:-ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకుని పోతు నవ తెలంగాణ దినపత్రిక, ప్రజా గొంతుకగా నిలుస్తుందని మహ ముత్తారం తాసిల్దార్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మహాముత్తారం మండలంలోని తాసిల్దార్ కార్యాలయం ఆవరణలోని నవ తెలంగాణ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ అడ్వాన్సుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.