ఊరుకొండ: ఎన్ని సమస్యలు చుట్టు ముట్టిన.. ఎన్ని కష్టాలు ఎదురైనా.. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టే ప్రసక్తి లేదని మాదారం సర్పంచ్ ధ్యాప నిఖిల్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఊరుకొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాటా ్లడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెడతాం కానీ పార్టీ మాత్రం విడబో మని అన్నారు. జడ్చర్ల నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించే విధంగా పార్టీకి పట్టుకొమ్మలైన కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని అన్నారు.. b. కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.