ఐజేయూ జిల్లా సహాయకార్యదర్శిగా నిమ్మగడ్డ

 నిమ్మగడ్డ శ్రీనివాస్ ను సన్మానిస్తున్న రాష్ట్ర నాయకులు
నిమ్మగడ్డ శ్రీనివాస్ ను సన్మానిస్తున్న రాష్ట్ర నాయకులు

నవతెలంగాణ-మంగపేట : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా కార్యదర్శిగా మండలానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు నిమ్మగడ్డ శ్రీనివాస్ నియమించినట్లు జిల్లా అద్యక్షుడు షఫీ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన సంఘం జిల్లా ప్రధమ మహాసభలో నియామకాన్ని రాష్ట్ర నాయకుల సమక్షంలో ప్రకటించి సన్మానించినట్లు తెలిపారు. నిమ్మగడ్డ శ్రీనివాస్ నియామకం పట్ల మండల పాత్రికేయులు హర్షం ప్రకటించారు.