శ్రీలంకలో ఎస్‌బిఐ శాఖను ప్రారంభించిన నిర్మలా సీతారామన్
మూడు రోజుల పర్యటన లో భాగంగా శ్రీలంకలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్రిం కోమలీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) కొత్త శాఖను ప్రారంభిం చారు. దీని ద్వారా శ్రీలంకకు ఇండియాకు మధ్య ఆర్ధిక సంబంధాలు మరింత మెరుగు పడనున్నాయి.
పర్యాటక ప్రోత్సాహం కొరకు భారతీయులకు వీసా రహిత ప్రవేశం కల్పించిన ధారులాండ్
భారతదేశం, తైవాన్ పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పించడం ద్వారా ధారు లాండ్ తన పర్యాటక రంగాన్ని అభివృద్ధి పర్చ డానికి చర్యలు తీసుకొంది. దీని ద్వారా భారత దేశం, తైవాన్ పౌరులు వీసా లేకుండా ధాయిలాండ్‌లో గరిష్టంగా 30 రోజులు ఉండగలరు.
హైదరాబాద్‌లో వాయుకాలుష్యం 18.6శాతం పెరుగుదల
రెస్పిరల్ రిపోర్ట్ ప్రకారం వాయు కాలుష్యం గత ఏడాదితో పోలిస్తే నాలుగు ప్రధాన నగరాలలో పెరిగిందని పేర్కొంది. ప్రధాన రాష్ట్ర రాజధానులలో 2019 మరియు 2023 మధ్య పి.ఎం 2.5 సాంద్రతలను అధ్యయనం విశ్లేషించింది. హైదరాబాద్‌లో పి.ఎం. 2.5 2019 మరియు 2020 మధ్య 59శాతం పెరిగింది. 2021లో 2.97 మరియు 2022లో గణనీయంగా 29.1శాతం పెరిగింది. అయితే 2023లో 18.6 శాతం మళ్ళీ పెరిగింది.
ప్రముఖ రచయిత టి.పద్మనాభన్‌కు ప్రతిష్టాత్మక కేరళ జ్యోతి అవార్డు
కేరళ ప్రభుత్వం ప్రఖ్యాత రచయిత టి.పద్మ నాభణ్‌ను ప్రతిష్టాత్మక కేరళ జ్యోతి అవార్డు గ్రహీతగా ఎంపిక చేసింది. మలయాళ సాహిత్యానికి పద్మనాభన్ చేసిన విశేష సేవలకు గుర్తింపుగా రాష్ట్రంలో ఈ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. సామాజిక జీవితంలో వివిధ అంశాలకు విశేషమైన కృషి చేసిన వ్యక్తులకు ‘కేరళ పురస్కారాలు’ అని పిలిచే అనేక ఇతర ప్రశంసలు కూడా కేరళ ప్రభుత్వం ప్రకటించింది.