నవతెలంగాణ – కంటేశ్వర్
10వ/ 8వ తరగతి పాసైన విద్యార్థులకు సువర్ణావకాశం, వృత్తి విద్యలో శిక్షణ పొంది జీవితంలో త్వరగా స్థిరపడాలని కోరుకునే విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వ ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ వారి పారిశ్రామిక శిక్షణా కేంద్రాలలో (ఐ.టి.ఐ) ఉచ్చితంగా అడ్మిషన్ పొంది వివిధ పారిశ్రామిక కోర్సులలో శిక్షణ పొందడానికి 2023 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనవని జిల్లా కన్వీనర్, ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐ.టి.ఐ) (బాలుర), నిజామాబాద్ ప్రిన్సిపాల్ ఎం.కోటిరెడ్డి గురువారం తెలిపారు. 14 సం.. పైబడిన అభ్యర్థులు అర్హులని వయస్సు పరిమితులు లేవని ధరఖాస్తు చేసుకోవడానికి తేదీ: 17. 05-2023 నుండి చివరి తేది: 10-06-2023 వరకు అని మరియు నోటిఫికేషన్, వివిధ కోర్సుల విద్యార్హతలకు https://iti.telangana.gov.in చూడాలని సూచించారు. పైన తెలిపిన వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకుని ఐ.టి.ఐ కోర్సు ప్రతిపాధికన వెబ్ ఆప్షన్స్ పెట్టి అన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన తెలిపారు. సీటు పొందడానికి మరిన్ని ఐ.టి.ఐ కోర్సులను వెబ్ ఆప్షన్స్ పెట్టాలని తెలిపారు. మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు వెబ్ ఆప్షన్స్ ఆధారంగా సీట్లు కేటాయించబడుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్: 9948195654, 9490057403 సంప్రదించాలని తెలిపారు.