వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిజామాబాద్ ఐ టి హబ్

– సరికొత్త ఆలోచనలతో వచ్చే వారిని ఇన్వెస్టర్ గా మార్చడమే లక్ష్యం
– గ్రామీణ ప్రాంతాల యువతకు చేరువగా సాంకేతిగా పరిజ్ఞానం
– గతంలో భూమిపూజ చేసి పనులను ప్రారంభించిన ఐ రీ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్
– ప్రారంభానికి ముస్తాబైన నిజామాబాద్ ఐ టి హబ్
– త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
– ప్రత్యక్షంగా 765 మందికి ఉద్యోగ అవకాశాలు
– పరోక్షంగా 4 రేట్లు యువతకి ఉపాధి అవకాశాలు
– ప్రైవేట్ రంగం లో పెట్టుబడుదరులని ఆహ్వానించి యువతకి ఉపాధి కల్పించడమే ప్రథమ లక్ష్యం..
– స్టార్టప్ కేంద్రంగా నిజామాబాద్ ఐ టి హబ్
– ఐ టి హబ్ కి ప్రత్యేక బస్సు సౌకర్యం-పరిశీలనలో పోలీస్ ఔట్ పోస్ట్
– పనులని పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల
– బి.ఆర్.ఎస్ పార్టీ ఎన్నారై గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల విదేశాల్లో పర్యటించి విదేశీ కంపెనీలకు ఆహ్వానం
– 8 విదేశీ కంపెనీలు నిజామాబాద్ ఐ టి హబ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించుకొనేందుకు ప్రభుత్వం తో అవగాహన ఒప్పందం
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల న్యూ కలెక్టరేట్ రోడ్డు లో నిర్మిస్తున్న ఐటీ హబ్ పనులని మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ..ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని ఐటి శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ సంకల్పించారు.ముఖ్యంగా నిజామాబాద్ యువతకు ఉపాధి కల్పించాలని వారిలో ఉన్న సరి కొత్త ఆలోచనలకు ఐటి హబ్ లు వేదిక గా మారి ఇన్వెస్టర్ గా మార్చి మరింత మందికి ఉపాధి కల్పించాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్ష.వారి సంకల్పం మేరకు విశాలమైన వాతావరణం లో ఐటీ హబ్ ని నిర్మించాము.మా సోదరుడు మహేష్ బిగాల మంత్రి కేటీఆర్ తో కలసి అమెరికా ఇతర దేశాల్లో పర్యటించి 8 విదేశీ కంపెనీలతో ఐడి హబ్ లో పనిచేయడానికి ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఐటీ అంటే హైదరాబాద్, బెంగుళూర్ కాదు తెలంగాణ లోనే ద్వితీయ శ్రేణి నగరాలలో ఒకటైన నిజామాబాద్ గుర్తుకు వచ్చేలా మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగింది.అతి త్వరలోనే ఐటి హబ్ ని మంత్రి కేటీఆర్ ప్రారంభించి స్థానిక యువతకి విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలియచేస్తున్నాను.