నేడు 144 సెక్షన్ అమలు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెళ్లడి

నవతెలంగాణ- కంటేశ్వర్

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నేడు అనగా ఆదివారం 144 అమలులో ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల లెక్కింపు నేపథ్యంలో ప్రజలందరూ సహకరించాలని అందుకు అనుగుణంగా ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది. ఓట్ల లెక్కింపు కేంద్రాలైన నిజామాబాద్ పట్టణంలోని గర్ల్స్ పాలిటెక్నిక్ కళాశాల, బాయ్స్ పాలిటెక్నిక్ కళాశాల పరిసర ప్రాంతాల్లో నేడు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సీపీ కల్మేశ్వర్ తెలిపారు. ఆదివారం ఉదయం 6గం. నుంచి సోమవారం ఉదయం 6గం.ల వరకు అమలులో ఉంటుందన్నారు. ఈ సమయంలో ఒక కిలోమీటర్ దూరం వరకు 5 మంది కంటే ఎక్కువ వ్యక్తులు గుమిగూడి ఉండటం నిషేధించడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు.