– 123 సంవత్సరాలు వయసున్న ఓటర్లు 6683
– పొరపాట్లు సరిచేయడానికి వారం వారం సమీక్ష
– ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజక వర్గంలోని 5 మండలాల్లో జననం 1900 సంవత్సరం గా నమోదు అయిన ఓటర్లు 6686 మంది ఉన్నట్లుగా ఓటరు ప్రక్షాళనలో తేలిందని,123 సంవత్సరాలు జీవించి అవకాశం లేనందున వీటిని తొలగించడానికి చర్యలు చేపట్టాం అని నియోజక వర్గం ఎన్నికల అధికారి,అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.ఓటరు జాబితాలో నమోదు అయిన పొరపాట్లు ను సరిచేయడానికి పార్టీల ప్రతినిధులతో వారం సమీక్ష చేస్తున్నాం అని అన్నారు. గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఓటరు జాబితా ప్రక్షాళన పై మూడో వారం సమీక్ష చేసారు.ఈ సందర్భంగా ఓటరు ప్రక్షాళనలో పార్టీల ప్రతినిధులు సహాకరిస్తేనే పారదర్శకం అయిన ఓటరు జాబితా రూపొందుతుందని తెలిపారు.నియోజక వర్గంలో ఒకే ఫొటో తో 1871 ఓటర్లు ఉన్నారని,ఓకే ఇంటి నెంబర్ 6 కంటే అధికంగా 25598 మంది ఓటర్లు నమోదు అయి ఉన్నారని,కుటుంబం అంటే నలుగురు లేక ఆరుగురు మాత్రమే అయినందున మిగతా వాటిని తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. గురువారం నాటికి నియోజక వర్గంలో 6,7,8 ఫాం లు మొత్తం 1807 దరఖాస్తులు వచ్చాయని,ఇందులో 873 ఆమోదం పొందాయని,62 తిరస్కరణకు గురయ్యాయని,ఇంకా 872 పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట,దమ్మపేట,అన్నపురెడ్డిపల్లి తహశీల్దార్ లు లూదర్ విల్సన్,స్వామి,భద్రకాళి లు,పార్టీల ప్రతినిధులు చిరంజీవి(సీపీఎం),రఫీ(సీపీఐ),ప్రభాకర్ (ప్రజా పంధా),మొగుళ్ళపు చెన్నకేశవరావు,బాలగంగాధర్(కాంగ్రెస్),నార్లపాటి శ్రీను(తెదేపా),మడకం ప్రసాద్(బీఎస్పీ),సంపూర్ణ(బీఆర్ఎస్) మరికొందరు పాల్గొన్నారు.