– పెరుగుతున్న ఆశావాహులు
నవతెలంగాణ – భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీలో ఈనెల 23న అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుత చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య లపై అవిశ్వాసం పెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఈ ఇరువురుపై సొంత పార్టీ వారే అవిశ్వాసానికి శ్రీకారం చుట్టారు వీరికి తోడుగా కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు సంతకాలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య అంతర్గత సమాలోచనలు జరిగాయి. అందులో భాగంగానే నవంబర్ నెలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఇద్దరు అవిశ్వాస తీర్మానానికి ప్రణాళిక రూపొందించారు. కౌన్సిలర్లకు తమ వైపు తిప్పుకోవడానికి తెరవెనుక ప్రయత్నాలు మొదలయ్యాయి.నవంబర్ నుండి మొదలైన అవిశ్వాసం ఏటికేలకు జనవరి నెలలో మెజార్టీ కౌన్సిలర్ అందరూ పార్టీలకతీతంగా వారిపై అవిశ్వాస తీర్మానం పెడుతూ సంతకాలు చేశారు. అందులో భాగంగా ఇప్పటికే పలుమార్లు ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన వారు క్యాంపు రాజకీయాలు చేశారు. హైదరాబాద్ తో పాటు సూర్యలంక బాపట్ల బీచ్ ల కు వెళ్లారు. చైర్మన్, వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం నిలుపుదల చేయాలని వేరువేరుగా వారి ఇరువురు హైకోర్టు మెట్లు ఎక్కిన హైకోర్టు ఆ అభ్యర్థులను తిరస్కరించినట్టు తెలిసింది.
చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్ పార్టీ నుండి అజీమ్ పోటీ పడుతుండగా, కాంగ్రెస్ నుండి పోత్నక్ ప్రమోద్ కుమార్, తంగళ్ళపల్లి శ్రీవాణి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు అధిక మెజార్టీ ఉండటంతో కాంగ్రెస్ తిరిగి తన బలాన్ని పెంచుకొని అధికారంలోకి వచ్చేవరకు చైర్మన్ ఎంపిక తేదీని నిలుపుదల చేయుటకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. చైర్మన్ ఎంపిక అయ్యే వ్యక్తి సుమారు ఒక్కొక్క కౌన్సిలర్ కు రూ. ఐదు లక్షలు ఖర్చు చేస్తేనే ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత చైర్మన్, వైస్ చైర్మన్ ల రాజీనామా చేర్పిస్తారని బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లు అందరూ ఏకతాటిపైకి వచ్చి తమను కలవవలసిందిగా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చైర్మన్ సీట్ కోసం పట్టుబడుతున్న కౌన్సిలర్ అజీమ్ కు తెలిపినట్టు తెలిసింది. ఈ విషయాన్ని కౌన్సిలర్లకు తెలియజేయడంతో కౌన్సిలర్లు కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
అవిశ్వాస తీర్మానానికి చిక్కులు:
– అడ్డుగా 2019 సవరణ చట్టం
– మున్సిపాలిటీ పాలకమండళ్ల ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్
– న్యాయ సలహా కోసం అడ్వకేట్ జనరల్ ను సంప్రదించిన ప్రభుత్వం
– కొత్త బాడీ ఎన్నికకు మరింత సమయం
రాష్ట్రంలో పలు మున్సిపాలి టీల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశ పెడుతున్నారు. నెగ్గిన చోట కొత్త పాలక మండలి ఎంపిక ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అందుకు ప్రస్తుతం ఉన్న చట్టంలో రూల్స్ రూపొందించకపోవడమే కారణ మని అధికారులు భావిస్తున్నారు. 1965 చట్టంలో పాలక మండలి ఎన్నిక నుంచి నాలుగేండ్ల వరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టకూడదనే నిబంధన ఉండేది. కానీ బీఆర్ఎస్ హయాంలో 2019లో మున్సిపల్ యాక్ట్ను సవరించి అవిశ్వాసం గడువు ను మూడేండ్లకు కుదించారు. దీంతో చాలా చోట్ల స్థానిక రాజకీయ విభేదాలతో మూడేండ్లు పూర్తి కా న్యాయ సలహా కోరిన ప్రభుత్వం.. అవిశ్వాస తీర్మానంతో ఆర్మూర్, నల్లగొండ మున్సి పాలిటీల్లో పాలక మండలి రద్దయ్యింది. మరో 35 చోట్ల అవిశ్వాసాలు పెట్టారు.
అయితే పాలక మండలి రద్దు అయిన చోట కొత్త పాలక మండలిని ఎలా ఎన్నుకోవాలి? అన్న క్లారిటీ లేదు. 2019లో సవరించిన చట్టంలో పాలక మండలి రద్దు అయితే కొత్త బాడీని ఎలా ఎంపిక చేయాలనే ప్రక్రియకు రూల్స్ తయారు చేయలేదు. అందుకని ప్రభుత్వం న్యాయ సలహా కోసం మున్సిపల్ శాఖ అడ్వకేట్ జనరల్ ను సంప్రదించింది. 2019 చట్టం మేరకు కొత్త రూల్స్ తయారు చేయాలా? 1965 చట్టం ఉన్న ప్రకారం కొత్త ఎన్నిక ప్రక్రియను కొనసాగిం చొచ్చా? అని వివరణ కోరింది. న్యాయ శాఖ నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. అప్పటి వరకు అవిశ్వాస తీర్మానాలు నెగ్గిన చోట కొత్త పాలక మండలి ఎన్నిక ప్రక్రియకు బ్రేకులు తప్పవని అధికారులు అభిప్రా యపడుతున్నారు. గత ప్రభుత్వం మున్సిపల్ చట్టం నూతనంగా నిబంధనలు పెట్టారు. మూడు సంవత్సరాల తర్వాత పలువురు సొంత పార్టీ చైర్మన్ లపై అవిశ్వాసాలు పెట్టారు. ఇది అప్పటి రూలిం గ్ పార్టీకి ఇబ్బందిగా మారింది. మళ్లీ చట్టాన్ని స వరించి నాలుగేళ్లకు పొడిగించారు. దానికి గవర్నర్ ఆమోదం తెలుపకపోవడంతో పెండింగ్లో ఉంది. ప్రభుత్వము న్యాయ సలహా కోసం మున్సిపల్ శాఖ అడ్వకేట్ జనరల్ ను సంప్రదింపులు చెయగాప్ర ప్రస్తుత ప్రభుత్వము అనుకూలంగా న్యాయ సలహా వచ్చే అవకాశాలు ఉన్నాయి.