మందిరాల వద్ద మందు..మాంసం వద్దు

– అమ్మకంపై నిషేధం కోసం మహారాష్ట్రలో హిందూత్వ సంస్థ ప్రయత్నం
– తప్పుబడుతున్న పరిశోధకులు, సామాజికవేత్తలు
ముంబయి: మహారాష్ట్రలో ఆలయాల వద్ద మందు, మాంసం దుకాణాల నిషేధానికి అక్కడి హిందూత్వ సంస్థ ఒకటి ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం ఒక డ్రైవ్‌ను నిర్వహించడానికి సదరు సంస్థ సభ్యులు సిద్ధమవుతున్నారు. మహారాష్ట్ర లోని పలు ఆలయ యాజమాన్యాలకు ఉన్నత సంస్థగా ఉన్న మహారాష్ట్ర మందిర్‌ మహాసంఫ్‌ు ఈ ప్రయత్నాలను చేస్తు న్నది. నెల కిందటే రాష్ట్రవ్యాప్తంగా 300 వరకు గుడులలో ఒక కఠినమైన డ్రెస్‌ కోడ్‌ను విధించారు. ఇప్పుడు సదరు హిందూత్వ సంస్థ పలు ప్రముఖ ఆలయాలకు 500 మీటర్ల దూరంలో మందు, మాంసం అమ్మకాలపై నిషేధం విధించడానికి యత్నిస్తున్నది.
ఇటీవల గోవాలో నిర్వహించిన ఏడు రోజుల అఖిల భారతీయ హిందూ రాష్ట్ర సమావేశంలో మహారాష్ట్ర మందిర్‌ మహాసంఫ్‌ు ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. రాష్ట్రంలోని మునిసిపల్‌ కార్పొరేషన్‌లో గల ఎక్సైజ్‌ విభాగం ప్రస్తుత నిబంధనల ప్రకారం విద్యా సంస్థలు, మత ప్రదేశాలు, రాష్ట్ర రవాణ బస్సు డిపార్ట్‌మెంట్‌ల నుంచి 50 మీటర్ల దూరంలో లిక్కర్‌ దుకాణాలపై నిషేధం ఉన్నది. అయితే, ఈ దూరాన్ని పెంచాలని సదరు హిందూత్వ సంస్థ కోరుతున్నది.
అయితే, సదరు హిందూత్వ సంస్థ ప్రతిపాదిత నిషేధాన్ని పలువురు తప్పు బడుతున్నారు. హిందూ మతంలో అలాం టి ఆచారానికి ఎలాంటి సంపూర్ణ నిబం ధన లేదని పరిశోధకులు జయరాజ్‌ సల గావోంకర్‌ అన్నారు.
నిషేధం విధించాల న్న ఒక్క నిబంధన హిందూ మతానికి సరి పోదని అన్నారు. హిందూ మతంలో పలు వర్గాలు ఉంటాయని చెప్పారు. కొందరు మందు, మాంసాన్ని సమర్పిస్తారనీ, మరి కొందరికి ఇది ఆమోదయోగ్యం కాదని జయరాజ్‌ అన్నారు. ఇలాంటి హిందూత్వ సంస్థలు తమకు నచ్చిన విధంగా వ్యవ హరిస్తూ హిందూమతంలోని ఇతర వర్గాల ఆచారాలను తొక్కిపెడు తున్నాయని సామాజిక, పౌర సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.