జీపీఎస్ వద్దు.. ఫాస్టాగ్ ముద్దు

– సార్వత్రిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలో స్వయంకృషి ట్రాలీ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 16న జరిగే సార్వత్రిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ సంబంధించిన పోస్టర్ ను ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా పబ్లిక్ ప్రైవేటు రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పున్నం రవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కేంద్ర బీజేపీ ప్రభుత్వం టోల్ గేట్ల స్థానంలో జీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడం వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. జీపీఎస్ వల్ల ఒక్కొక్క వాహనంపై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు డ్రైవర్లు భరించలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రవాణా రంగ కార్మికులకు నిరాశపరచిందని తెలిపారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తో గ్రామీణ ప్రాంత ఆటో డ్రైవర్ల ఉపాధి కి గండి పడిందన్నారు. డ్రైవర్ల కుటుంబాలు రోడ్డుపాలు ఆవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా తయారైందని డ్రైవర్ల బతుకులు ఇప్పటికే పెట్రోల్ ,డీజిల్,ధరలు అట్లాగే ఇన్సూరెన్స్, ఫిట్నెస్ చార్జీలు వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆటోలు అమ్ముకునే పరిస్థితి నెలకొందని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని డ్రైవర్లకు ప్రభుత్వమే ఉపాధి కల్పించాలి బీడీ, గీత ,నేత కార్మికులకు ఇస్తున్నట్టు, డ్రైవర్లకు నెలకు జీవనభృతి కింద రూ.4500/రూపాయలు ఇవ్వాలని,అట్లాగే రూ.10 లక్షలు ప్రమాద భీమా, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని,కేరళ రాష్ట్రం మాదిరిగా ప్రభుత్వమే సవారి యాప్ అమలు చేసి డ్రైవర్లను ఆదుకోవాలని, లేనియెడల ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని, హెచ్చరించారు ,ఫిట్నెస్ రద్దు చేయాలని, పెట్రోల్, డీజిల్ ధరలు సుంకం తగ్గించాలి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 16న జరిగే సమ్మె గ్రామీణ భారత్ బంద్ లో శంకరపట్నం మండల వ్యాప్తంగా ఉన్నటువంటి లారీ, బస్సు, కారు ,ఆటో ,ట్రాలీ, ట్రాక్టర్ , టాటా ఏసీ,అన్ని రకాల వాహనాలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్వయంకృషి ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీనివాసు, కోశాధికారి గడ్డం రవీందర్ ,కల్లెపెల్లి శ్రీకాంత్, మూల సత్యం,గోలి పెలి రాజయ్య, పావురాల శ్రీనివాసు, గుండా నగేష్, తదతరులు పాల్గొన్నారు.