వర్షాల ఉద్రుతికి ఎవరూ బయటకెల్లోద్దు..

– దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు 
నవతెలంగాణ -దుబ్బాక రూరల్
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లోని చెరువులు, కుంటలు, మత్తడులు, చెక్ డ్యాంలు, వంకలు ఉధృతంగా నీరు ప్రవహిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ప్రజలెవరూ బయటకు రావొద్దని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పిలుపునిచ్చారు.  ఇటీవల దుబ్బాక మండల పరిధిలోని ఆకారం గ్రామం వద్ద కూడవెళ్లి వాగు వర్షాలకు పొంగిపొర్లుతున్న సందర్భంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. వర్షాల కారణంగా ఆకారం నుండి బీబీపెట్, కామారెడ్డి పరిసర ప్రాంతాలకు వెళ్ళే ఈదారి ప్రధాన రహదారి కావడంతో బ్రిడ్జిపై నుండి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలెవరూ బయటకు వెళ్ళోద్దని సూచించారు. అంతక ముందు అక్కడున్న పరిస్థితుల గురించి స్థానికులతో మాట్లాడి  అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంబటి బాలేష్ గౌడ్, చింత సంతోష్, దూలం వెంకట్ గౌడ్, బిక్షపతి, పుట్ట వంశీ, మచ్చ శ్రీనివాస్, తోగుట రవీందర్ తదితరులు ఉన్నారు