బాల్కొండ నియోజకవర్గంలో నామినేషన్  బోని        

– నాలుగవ రోజు మూడు నామినేషన్ల దాఖలు
– సురేష్ రెడ్డి తో కలిసి బీర్ ఎస్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి నామినేషన్ దాఖలు
– కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ తరపున నామినేషన్ దాఖలు చేసిన నాయకులు
– డీఎస్పీ అభ్యర్థి  మంగళవారం భోజన్న దాఖలు
 నవతెలంగాణ-భీంగల్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 3న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ భాగంగా బాల్కొండ నియోజకవర్గ స్థానానికి భీంగల్  పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రంలో నాలుగవ రోజు సోమవారం  మూడు నామినేషన్  లు దాఖలు అయ్యాయి. టిఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు .కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ రెడ్డి తరఫున పార్టీ నాయకుడు సుంకేట రవి  బొదీరే స్వామి పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ దాఖల పత్రాన్ని రిటర్నింగ్ అధికారి చిత్రమిశ్రాలకు అందజేశారు.  అలాగే డీఎస్పీ పార్టీ  అభ్యర్థిగా మంగళవారం భోజన్న నామినేషన్ వేశారు.నామినేషన్ కేంద్రం వద్ద భీంగల్ సీఐ వెంకటేశ్వర్లు ఎస్సై హరిబాబుల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు