జుక్కల్ అసెంబ్లీకి మొదటి రోజు నామినేషన్లు నీల్

– ఎన్నికల రిటర్నింగ్ అధికారి మను చౌదరి ఐఏఎస్
నవతెలంగాణ -మద్నూర్:
కామారెడ్డి జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు కాన్స్టెన్సీ అయినా జుక్కల్ నియోజకవర్గం ఎన్నికకు శనివారం నాడు నోటిఫికేషన్ జారీ కాగా మొదట రోజు నామినేషన్లు దాఖలు కాలేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మను చౌదరి ఐఏఎస్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎండి ముజీబ్ విలేకరులకు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికకు ఈనెల 3 నుండి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ 13న స్క్రూట్ ని 15 వరకు విడ్రాల్ ఈనెల 30న పోలింగ్ డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుందని వారు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కావడంతో మద్నూర్ తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఎన్నికల అధికారి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు నామినేషన్ల దాఖలకు అభ్యర్థి వెంట నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు జుక్కల్ అసెంబ్లీలో ఎన్నికలు సజావుగా సాగడానికి అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.