ఉత్తర తెలంగాణ క్లాసులు వాయిదా

నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఉత్తర తెలంగాణ (ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్) జిల్లాల క్లాసులు నేటి నుండి అనగా తేదీ: 27 – 05 – 2023 నుండి తేదీ: 29 -05 – 2023 వరకు నిజామాబాదులో రాజకీయ శిక్షణ తరగతులు జరగనున్నాయి. కానీ,నిన్న 25 తారీఖున జరిగిన రాష్ట్ర సదస్సులో ఉపాధి హామీ రక్షణ కోసం ముఖ్యమైన కర్తవ్యాలను రాష్ట్ర కమిటీ ఇచ్చింది. జూన్ 5 తారీకు వరకు వివిధ రూపాలలో కార్యక్రమాలు నిర్వహిస్తూ జూన్ 5వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమం ఆలిండియా కమిటీ ఇచ్చిన పిలుపును అమలు చేయడానికి ఈ క్లాసులను తాత్కాలికంగా వాయిదా చేయవలసి వచ్చింది. మరుసటి తేదీలను త్వరలోనే తెలియజేస్తాం. ఈ మార్పుని గమనించి అందరూ సహకరించగలరని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ పత్రిక విలేకరుల సమావేశం జరిపి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష-కార్యదర్శులు ఏషాల గంగాధర్ – పెద్ది వెంకట్రాములు, జిల్లా ఉపాధ్యక్షులు పుస్పూర్ లింగం లు పాల్గొన్నారు.