ఆయిల్ ఫాం మొక్కకు నోట్లు..

నవతెలంగాణ – అశ్వారావుపేట 
ఆయిల్ ఫాం మొక్కకు నోట్లు ఏంటి అనుకుంటున్నారా? అయితే ఆ ఆయిల్ ఫాం గెలలు కు ప్రస్తుతం మెరుగైన ధర పలుకుతుంది. ఈ విషయాన్ని ఈ విధంగా ఆ రైతు వ్యక్తం చేసాడు. ఎంతో కొంత ఆయిల్ ఫాం సాగు    చేస్తే చాలు కడుపులో నీళ్ళు కదలకుండా నిశ్చింత గా బతికే యొచ్చు.గత కొంతకాలంగా సాగుచేస్తున్న రైతుల ఆర్ధిక స్థితి చూసిన ప్రస్తుతం సాగు చేయబోతున్న రైతులు భావన. ఇంకేముంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పండు వారిగూడెంకి చెందిన రైతు నడింపల్లి శివరామరాజు ఏకంగా తన 54 ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు చేయాలని నిర్ణయించాడు.మంగళవారం ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ని ఆహ్వానించి మొదటి మొక్కను ఆయనతో నాటించారు.ఆయిల్ ఫాం సాగు చేస్తే ఇక డబ్బులు మస్తుగా వస్తాయని నమ్మిన రైతు మొదటి మొక్కకు రూ.500, రూ.200 నోట్లను కట్టి అక్కడున్న వారి దృష్టిని ఆకర్శించాడు. ఇంత పెద్ద మొత్తంలో ఆయిల్ ఫాం సాగు చేపట్టిన రైతు శివరామరాజును ఆయిల్ఫెడ్ చైర్మన్ తోపాటు తోటి రైతులు అభినందించారు.