తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులకు ఎన్ ఎస్ యుఐ మద్దతు..

నవతెలంగాణ -డిచ్ పల్లి: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రధాన ద్వారం ముందు తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులరైజేషన్  కోసం నాలుగు రోజులుగా సమ్మెలో  తెలంగాణ యూనివర్సిటీ ఎన్ ఎస్ యుఐ అధ్యక్షులు కె.శ్రీశైలం పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీ పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సీఎం కేసిఆర్ ఇచ్చిన హామీని అమలు చేసి యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను జెఎల్, డిఎల్ పిఎల్ మాదిరిగా రెగ్యులర్ చేయాలని మనవి చేశారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తూ ముందుండే అధ్యాపకులే ఈరోజు రోడ్డున నించొని ధర్నాలో చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉందని, అలాగే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతులే ఉండవు అన్న కేసీఆర్ కు ఈరోజు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కనబడట్లేదా అని ప్రశ్నించారు. యూనివర్సిటీలో అభివృద్ధి చెందాలంటే విద్యార్థులకు సరైన, సౌకర్యాలు కల్పించాలి కానీ యూనివర్సిటీలోని రిక్రూట్మెంట్లు ఆపేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే సరికాదని అన్నారు. యూనివర్సిటీలోని కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్  చేయాలని  డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ  వైఖరి ఇలాగే కొనసాగితే యూనివర్సిటీలను కాపాడుకునేందుకు అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసే అంతవరకు పోరాడుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు అభినయ్, రాజేందర్, రాజ్ కుమార్, అనీల్, తదితరులు పాల్గొన్నారు.