ఎన్‌.టి.ఆర్‌. రాజకీయ రంగంలో ఎందరినో ప్రభావితం చేశారు

వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్‌ రెడ్డి
రవీంద్ర భారతిలో ఎన్టీఆర్‌, కృష్ణ, దాసరి జయంతి వేడుకలు
డనవతెలంగాణ-కల్చరల్‌
ఎన్‌.టీ.ఆర్‌ రాజకీయ రంగంలో ఎందరినో ప్రభావితం చేసారని వారిలో నేడు చాలామంది అధికారంలోకి వచ్చారని వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, శాసన మండలి సభ్యుడు మధుసూదనాచారి లకు ఎన్‌.టీ.ఆర్‌ స్ఫూర్తి అన్నారు. రవీంద్రభారతి ప్రధాన వేదిక పై శతిలయ ఆర్ట్స్‌ అకాడమీ, సీల్‌ వెల్‌ కార్పోరేషన్‌, ఆర్‌.ఆర్‌.ఫౌండేషన్‌ సంయుక్త నిర్వ్యహణ లో భాషా సాంస్కతిక శాఖ సౌజన్యంతో ఎన్‌.టీ.ఆర్‌.,కృష్ణ, దాసరి నారాయణ రావు జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి.ముఖ్య అతిధిగా నిరంజన్‌ రెడ్డి పాల్గోని మధుసూదనాచారి ని ఎన్‌.టీఆర్‌. స్ఫూర్తి పురస్కారం తో సత్కరించి మాట్లాడారు. తారక రామారావు సినీ రంగంలో ఒక చరిత్ర, రాజకీయ రంగంలో సంచలనం అన్నారు. మధు సూదనాచారి ఎన్‌.టి.ఆర్‌ కు అత్యంత అభిమాన అనుచరులని గుర్తు చేశారు. సెల్వెల్‌ కార్పోరేషన్‌ బండారు సుబ్బారావు స్వాగతం పలికిన సభలో పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ కోలేటి దామోదర్‌ సంస్థ అధ్యక్షుడు భీంరెడ్డి, దైవజ్ఞ శర్మ, కళ రఫీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దాసరి యువ దర్శకుడు పురస్కారం బొమ్మకు మురళికి, ఎన్‌.టీ.ఆర్‌ సేవ పురస్కారం డాక్టర్‌ జగదీష్‌ కు శ్రీనివాస్‌ గౌడ్‌ శ్రమ శక్తి పురస్కారం బహుకరించారు. కార్యక్రమానికి తొలుత ప్రముఖ గాయని డాన్స్‌ అకాడమీ వారి నత్యాలు ఆకట్టుకున్నాయి.