నవతెలంగాణ – నసురుల్లాబాద్
రాజకీయాలకు విలువ తెచ్చిన మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నెమ్లీ సాయిబాబా మందిరం కల్యాణ మండపంలో స్పీకర్ మాట్లాడుతూ వర్ని మండల లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాంస్య విగ్రహం ప్రారంభిస్తున్నట్లు ఆని తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహ ఏర్పాట సందర్భంగా నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పెక్సీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నందమూరి తారక రామారావు సామాన్య ప్రజలకు పేదలకు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీ రామారావు అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అనే ఆయన డుగు జాడల్లో నడిసిన వ్యక్తినని, మీ ముందు ఇంతగా మాట్లాడుతున్న అంటే ఎన్టీ రామారావు నేర్పిన రాజకీయ అడుగులెన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పటేల్ పట్వారి వ్యవస్థను నిర్మూలించి, దొరతనాన్ని ఉక్కు పాదంతో అణిచివేసి ప్రతినిత్యం ప్రజల అవసరాలు తెలుసుకొని అభివృద్ధి దిశలో నడిపిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు డాక్రా మహిళా సంఘాలకు నాంది పలికి మహిళలంటే ఆదిపరాశక్తి మహిళలకు ప్రతి రంగంలో 50 శాతం రిజర్వేషన్ ఉండాలి ప్రతి రంగంలో ముందుండాలి అని మహిళలను ప్రోత్సహించిన మహా యోధుడు ఆడబిడ్డకు తన పుట్టిన ఇంట్లో తన అన్నదమ్ములతోపాటు తనకు కూడా సమానమైన ఆస్తిపస్తులు వచ్చే విధంగా జీవో అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు..