నవతెలంగాణ- మోపాల్: మోపాల్ మండలం బోర్గం గ్రామం లో నూడా చైర్మన్ ఈగ సంజీవ రెడ్డి, భూమారెడ్డి ఆధ్వర్యంలో శాస్త్రి నగర్ మరియు ఎస్ సి కాలనీ లలో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపించాలని ఇంటిటా ప్రచారం చేశారు. ఈ సందర్బంగా నూడా చైర్మన్ మాట్లాడుతూ కెసిఆర్ చేసినటు వంటి అభివృద్ధి పనులు, చేపట్టిన సంక్షేమ పథకాలు కల్యాణ లక్ష్మి, రైతు బందు, షాదీ ముబారక్, బీసీ బందు, మైనార్టీ బంధు, అలాగే తెలంగాణ రాకనా ముందు మన గ్రామ పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలని, నిరుపేదలకు అన్ని విధాలుగా ఆదుకుంటూ అలాగే దళిత సోదరులకు దళిత బంధు గ్రామాలలో చెక్ డ్యామ్ లు బ్రిడ్జి లు ఎన్నో అభివృద్ధి పనులు కెసిఆర్ రూరల్ ఎం ఎల్ ఏ బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వం లో రూరల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందినదాని అన్నారు. అలాగే పెన్షన్స్, బీడీ కార్మికులకు పెన్షన్ ల వాటితో ఎంతో అభివృద్ధి చెందిందని కావున మళ్ళీ రూరల్ ఎం ఎల్ ఏ ను భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరుతూ కచ్చితంగా ఈసారి మన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని రూరల్ నియోజకవర్గం లోనే బోర్గాం ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదామని ఆయన తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమం లో మాజీ ఎం పి పి సందగిరి భూమారెడ్డి, సొసైటీ చైర్మన్ చంద్ర శెకర్ రెడ్డి, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు ఈగ నర్సారెడ్డి, శ్రీనివాసరెడ్డి, బంటు దాస్, పండరి, శ్రీనివాస్, శేకర్,జి.మల్లారెడ్డి,ఎర్రన్న, శాస్త్రి నగర్ వినయ్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.