– కాంగ్రెస్ పార్టీ జుక్కల్ ఎమ్మెలే అబ్యర్థి తోట లక్ష్మీ కాంతారావ్.
నవతెలంగాణ – జుక్కల్: బీఆర్ఎస్ పార్టీ అబ్యర్థి ఎమ్మెలే హన్మంత్ షిండే ఆభివృద్ది చేయడు, ఎవరితో మాట్లాడడు అని జుక్కల్ కాంగ్రేస్ పార్టీ అబ్యర్థి తోట లక్ష్మీకాంతారావ్ ఆరోపించారు. మంగక్ళ వారం నాడు మండలంలోని సోపూర్, శక్తీనగర్, మథురాతాండా, డోన్గాం, వజ్రఖండి, సావర్ గావ్, సావర్ గావ్ తాండా, ఖండేబల్లూర్, బస్వాపూర్, జుక్కల్ , గుండూర్, బంగారుపల్లి, దోస్పల్లి, మైబాపూర్, గ్రామాలలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్భంగా కాంగ్రెస్ పార్టీ అబ్యర్థి తోట లక్ష్మీకాంతారావ్ మాట్లాడుతు ఎమ్మెలే హన్మంత్ షిండే స్వంత గ్రామములో పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉందంటే వర్ణానాతీతం అని, ఆభివృద్గి చేయక కమీషన్ లు ఇస్తనే పని చేస్తాడని, ఇసుక మాఫీయాతో కలిసి కోట్ల రూపాయలు అర్జించి మహరాష్ట్ర లోని ఉద్గిర్ లో రెండు ఫాం హౌస్ లు, కర్ణాటకలో వందల ఎకరాలు భూములు, బెంగుళురులో కోట్ల రూపాయలు ఇల్లు ఉందని, ఇవవ్ని ఎక్కడి నుండి వచ్చాయే ప్రజలకు సమాదానం చేప్పాలని ఆరోపించారు, కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే అవినీతికి పాల్పడ్డ వారి భరతం పడుతామని అన్నారు. వజ్రఖండి జీపీ సర్పంచ్ అధ్వర్యంలో పెద్ద తడ్గూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ నాగ్ నాథ్, ఒకవంద పదకొండు మంది వజ్రఖండి సర్పంచ్ అద్వర్యంలో కాంగ్రెస్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సంధర్భంగా ఆరు గ్యారంటి పథకాలను అమలు చేసి జుక్కల్ వెనుక బాటుకు గురికాకుండా ఆభివృద్ది పథంలో తోడ్పటు నందిస్తామని చేతు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక గుల్బర్గ సౌత్ ఎమ్మెలే ప్రభుపాటీల్, నాయకుడు నాయుడు ప్రకాష్, మాజీ విండోచైర్మేన్ మనోజ్ పటేల్, సోపూర్ సర్పంచ్ అనుషాబాయి శీవాజీ పటేల్, వజ్రఖండి సర్పంచ్ సంజీవ్ పాటీల్, కేమ్రాజ్ కల్లాలి సర్పంచ్ రమేష్ రావ్ దేశాయి, పెద్దఎడ్గి సర్పంచ్ ఎ. వినోద్, నాయకులు దాదారావ్ పటేల్, దిలిప్ పటేల్, పాండుపటేల్, శీవాజీ పటేల్, బాబు పటేల్, సాహెబ్ రావ్, విఠల్ పాటీల్, తాజా మరియు మాజీ ఎంపిటిసిలు, సర్పంచులు, విండో డైరెక్టర్లు, తదితరులు పాల్గోన్నారు.